Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

4 నెలలు, 26 కిలోలు... బరువు ఎలా తగ్గానన్న విషయాన్ని చెప్పిన సానియా మీర్జా!

  • కోర్టులోకి దిగేందుకు సిద్ధమవుతున్న సానియా
  • బరువు పెరిగిన తరువాత ట్రోలింగ్ చేశారు
  • క్రమం తప్పని వ్యాయామంతో శరీరానికి మేలు
ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, మళ్లీ కోర్టులోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. కుమారుడు ఇజాన్ పుట్టిన తరువాత చాలా బరువు పెరిగిన ఆమె, ఇప్పుడు రెగ్యులర్ గా వ్యాయామం, జిమ్ చేస్తూ, కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే 26 కిలోల బరువు తగ్గారు. ఇక, ఇదెలా సాధ్యమైందన్న విషయాన్ని తాజాగా, ఓ మీడియా సమావేశంలో సానియా వెల్లడించారు.

తాను గర్భవతిని అయిన తరువాత, బరువు పెరిగానని, ఇది సాధారణమైన విషయమేనని గుర్తించకుండా తనను ట్రోల్ చేశారని వ్యాఖ్యానించిన ఆమె, ఇజాన్ పుట్టిన మూడు నెలల తరువాత నుంచి వ్యాయామం ప్రారంభించానని చెప్పారు. క్రమం తప్పని వ్యాయామం కారణంగా 4 నెలల్లోనే తిరిగి సాధారణ స్థాయికి చేరుకున్నానని అన్నారు. తనకు వంట చేయడం రాదని, అందువల్లే ఓ మంచి కుక్ ను పెట్టుకున్నానని చెప్పారు. వంట చేయడం కూడా తనకు ఇష్టముండదని సానియా మీర్జా వ్యాఖ్యానించారు.
Sania Mirza
Tennis
Jim

More Telugu News